TCS Layoffs: లే ఆఫ్ లో భాగంగా TCS కీలక నిర్ణయం.. కొత్త నియామకాలు, జీతాల పెంపు బంద్.. 35 డేస్ డెడ్ లైన్
TCS Layoffs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ కంపెనీ నుండి 12000 మందిని తొలగించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే.

TCS may pause hikes, senior hiring after mass layoffs announcement
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇటీవల తమ కంపెనీ నుండి 12000 మందిని తొలగించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా TCS సంస్థ గురించి మరో షాకింగ్ న్యూస్ ను ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అదేంటంటే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుభవజ్ఞులైన నిపుణుల నియామకాలను, ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల వార్షిక జీతాల పెంపును నిలిపివేయనుందట. 12,000 మంది ఉద్యోగులను తొలగించాలని ఆలోచనను ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో క్లయింట్ ప్రాజెక్టులకు కేటాయించబడని చాలా మంది బెంచ్డ్ ఉద్యోగులు ఉన్నారట. అలాంటి వారిని తొలగించడం కోసమే టాటా గ్రూప్ సంస్థ ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందని తెలిపింది. వారికి బిల్ చేయదగిన అసైన్‌మెంట్‌ను కనుగొనడానికి లేదా కంపెనీ నుండి నిష్క్రమించడానికి 35 రోజుల సమయం ఉందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్, పూణే, చెన్నై, కోల్‌కతాతో సహా పలు నగరాల్లో అటువంటి సిబ్బందిని తొలగించడం ఇప్పటికే ప్రారంభమైంది.
ఒక సీనియర్ ఐటీ విశ్లేషణ ప్రకారం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పని చేస్తున్న ఒక సీనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించడం వల్ల సవత్సరానికి రూ.2,400 నుంచి 3,600 కోట్లు ఆదా కానుందని అంచనా వేశారు. అందుకే ఖర్చుతో కూడిన ఒప్పందాలు, AI ఉత్పాదకత లాభాల కారణంగా కంపెనీలు తక్కువ మందితో ఎక్కువ వర్క్ చేయవలసిందిగా బలవంతం చేస్తున్నాయని బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ సూచించింది.