TS DOST 25: విద్యార్థులకు అలెర్ట్.. గడువు ముగుస్తోంది.. ‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
దోస్త్ - 2025 లో భాగంగా తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

Telangana DOST 2025
దోస్త్ – 2025 లో భాగంగా తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తవగా.. ప్రస్తుతం సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతోంది. అర్హులైన విద్యార్థులు జూన్ 8లోపు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులు జూన్ 9వ తేదీలోపు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
ముందుగా తెలంగాణ దోస్త్ ఆఫీషియల్ వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
హోంపేజీలో Candidate Pre-Registration అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
తర్వాత జనరేట్ అయిన దోస్త్ ఐడీ ద్వారా లాగిన్ అవ్వాలి.
తరువాత ఫీజు చెల్లించాలి.
లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
తరువాత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
సీట్ల కేటాయింపు:
సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్ 13న మొదలై జూన్ 18వ తేదీతో ముగుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ అలా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ మేరకు జూన్ 13 నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు. జూన్ 18 లోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు క్యాన్సిల్ అవుతుంది. మూడు విడతలు ప్రక్రియ తరువాత కూడా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లుగా ప్రకటిస్తారు.
మూడో విడత ఎప్పుడంటే:
తెలంగాణ దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 13 నుంచి 19 వరకు కొనసాగనుంది. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.