TS EAPCET 2025: టీఎస్ ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. మూడు విడతల్లో ప్రక్రియ.. మరిన్ని వివరాలు మీకోసం
తెలంగాణ ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు.

Telangana Eapcet 2025 counselling schedule released
తెలంగాణ ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. బీటెక్ సీట్ల భర్తీ కోసం జరుగనున్న ఈ ప్రక్రియపై ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ఫీజులలో ఎలాంటి మార్పులు లేకుండా పాత ఫీజుల ప్రకారమే ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది అని వెల్లడించారు. ఇక ఈ కౌన్సిలింగ్ మొత్తం మూడు దశల్లో జరుగనుంది. మొదటి విడుత కౌన్సెలింగ్ జూన్ 28 నుంచి ప్రారంభం కానుంది.
తొలి విడుత కౌన్సెలింగ్ వివరాలు:
- జూన్ 28 నుంచి జులై 7 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుంది.
- జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- జులై 6 నుంచి 10 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి.
- జులై 10న ఫ్రీజింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- జులై 18న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
- జులై 18 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- ఒకవేళ ఏ కారణం చేత అయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే అలాట్ చేసిన సీట్ రద్దు అవుతుంది.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలు(ఫస్ట్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారికి మాత్రమే):
- జులై 25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- జులై 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
- జులై 26 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలి.
- జులై 27న ఫ్రీజింగ్ చేసుకునే అవకాశం
- జులై 30న సెకండ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
- జులై 30 నుంచి ఆగస్ట్ 1 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకోవాలి.
ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలు (ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో నమోదు చేసుకోని వారు మాత్రమే):
- ఆగస్టు 5 సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- ఆగస్టు 6 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది.
- ఆగస్టు6 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరుగుతుంది.
- ఆగస్టు 7 ఫ్రీజింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటుంది.
- ఆగస్టు 10 సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
- ఆగస్టు 10 నుంచి 12 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
- ఆగస్టు 11 నుంచి 13 వరకు ఫిజికల్‌గా రిపోర్ట్ చేసుకోవాలి.