TG Entrance Exams : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే?

TG Entrance Exams : బీటెక్, ఫార్మ్ డీ, బీఈ, బీ ఫార్మ‌సీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు టీజీ‌ఈఏపీ‌సెట్ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్, మేలో జరుగనున్నాయి.

TG Entrance Exams : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు.. ఎప్పటినుంచంటే?

Telangana Entrance Exam Dates

Updated On : January 15, 2025 / 3:29 PM IST

TG Entrance Exams : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యాసంవ‌త్స‌రంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ మేర‌కు ప‌రీక్ష తేదీల‌ను బుధవారం (జనవరి 15) ఉన్న‌త విద్యామండ‌లి వెల్ల‌డించింది.

Read Also : UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఏయే తేదీల్లో పరీక్ష జరగనుందంటే?

ఏప్రిల్‌ 29 నుంచి ఈఏపీసెట్‌ జరగనుంది. బీటెక్, ఫార్మ్ డీ, బీఈ, బీ ఫార్మ‌సీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు టీజీ‌ఈఏపీ‌సెట్ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్, మేలో జరుగనున్నాయి. ఫార్మ‌సీ, అగ్రిక‌ల్చ‌ర్ కోర్సులకు పరీక్షలు ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీల్లో, మే 2 నుంచి 5వ తేదీ వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ (CBT) విధానంలో నిర్వ‌హించ‌నున్నారు.

టీజీ ఈసెట్ (TGECET)ప్ర‌వేశ ప‌రీక్ష‌ మే 12న టీజీ ఎడ్‌సెట్‌, జూన్ 1న టీజీ లాసెట్ (TG LAWCET), ఎల్ఎల్ఎం (LLM) కోర్సుల‌కు జూన్ 6, ఐసెట్ (I-CET) ప‌రీక్ష‌ల‌ను జూన్ 8, జూన్ 9 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్ 16 నుంచి 19 వ‌ర‌కు టీజీ పీజీఈసెట్ ప‌రీక్ష‌ల‌ను టీజీ పీఈసెట్ (TGPECET) ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను జూన్ 11 నుంచి జూన్ 14 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ారు.

Read Also : PM Modi: అధునాతన యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ