Inter Weightage Canceled : ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది.

Inter Weightage Canceled : ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Inter Weightage Canceled

Updated On : April 20, 2023 / 8:51 AM IST

Inter Weightage Canceled : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్మీడియట్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేసింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు శాశ్వతంగా ఎత్తివేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో 18ని జారీ చేశారు. దీంతో ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగానే ర్యాంకులు కేటాయించనున్నారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మాడీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011 సంవత్సరంలో నాటి ప్రభుత్వం జీవో 73 జారీ చేసింది. ఎంసెట్ మార్కులను 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీని అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానంతో విద్యార్థులు నష్టపోతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం

ఈనేపథ్యంలో ఇంటర్ వెయిటేజీ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయించింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ, ఇంటర్మీడియట్ బోర్డుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే అందరూ వెయిటేజీ రద్దుకే మొగ్గు చూపారు. దీంతో రాష్ట్ర ప్రభత్వం ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.