TS పాలిసెట్-2019 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2019-20 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజినీరింగ్ కోర్సుల్లో డిప్లొమా ప్రవేశాలకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్(SBTET) ‘పాలిసెట్ – 2019’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Read Also : మే 22 డీఈఈసెట్ పరీక్ష
* విద్యా అర్హత:
ఈ కోర్సుల్లో ప్రవేశానికి పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి..లేదా ప్రస్తుతం పరీక్ష రాస్తున్న అభ్యర్థులు అయిన దరఖాస్తు చేసుకోవచ్చు.
* దరఖాస్తు విధానం:
అభ్యర్థులు మార్చి 14 నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* పరీక్ష ఫీజు:
జనరల్ అభ్యర్థులు రూ.400; SC, ST అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈ ఏడాది ఏప్రిల్ 16న పాలిసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పాలిసెట్ ఫలితాలను ఏప్రిల్ 24న వెల్లడించనున్నారు.
* ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా.
* పరీక్ష విధానం:
ప్రవేశ పరీక్షలో మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్-60, ఫిజిక్స్-30, కెమిస్ట్రీ-30 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు 36గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మూడేళ్లు, మూడున్నరేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందుతారు.
* ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల | 13.03.2019. |
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం | 14.03.2019. |
పాలిసెట్ పరీక్ష తేదీ | 16.04.2019. |
ఫలితాలు | 24.04.2019. |