TS EAMCET-2023 : ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలకు సర్వం సిద్ధం

రోజుకు 67 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధ, గురువారాల్లో జరిగిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగ పరీక్షలు సజావుగా జరిగాయి.

TS EAMCET-2023 : ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలకు సర్వం సిద్ధం

TS EAMCET-2023

Updated On : May 12, 2023 / 8:00 AM IST

TS EAMCET-2023 : తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇంజినీరింగ్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు ఎగ్జామ్స్ జరుగనున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో ఆరు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

రోజుకు 67 వేల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కాగా, బుధ, గురువారాల్లో జరిగిన అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగ పరీక్షలు సజావుగా జరిగాయి. గురువారం ఉదయం సెషన్ కు తెలంగాణలో 93.28శాతం, ఏపీలో 87.88 శాతం చొప్పున మొత్తం 92.31 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Inter Weightage Canceled : ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

మధ్యాహ్నం సెషన్ కు తెలంగాణలో 94.63 శాతం, ఏపీలో 88.41 శాతం చొప్పున మొత్తం 93.52శాతం విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, జెఎన్ టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి పర్యవేక్షించినట్లు ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కో కన్వీనర్ కే.విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మే12వ తేదీన ఇంజనీరింగ్ పరీక్షకు మొదటి సెషన్ లో 34,507, రెండో సెషన్ లో 34,241 విద్యార్థులు హాజరుకానున్నారు. 13వ తేదీన మొదటి సెషన్ లో 34,653, రెండో సెషన్ లో 34,364 మంది విద్యార్థులు హాజరవ్వనున్నారు. మే14వ తేదీన మొదటి సెషన్ లో 33,861, రెండో సెషన్ లో 33,727 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు.