TS TET 2025 Result: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. 33.98శాతం ఉత్తీర్ణత.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

TS TET 2025 Result: తెలంగాణ టెట్ ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది.

TS TET 2025 Result: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. 33.98శాతం ఉత్తీర్ణత.. రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి

Telangana Teacher Eligibility Test Results Released

Updated On : July 22, 2025 / 12:07 PM IST

తెలంగాణ టెట్ ఫలితాలను విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 90,205 మంది పరీక్షలకు హాజరుకాగా 30,649 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. 33.98శాతం ఉత్తీర్ణత సాధించారని అధికారులు వెల్లడించారు. ఇక తెలంగాణ టెట్ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మంగళవారం(జులై 22) ఆన్ లైన్ లో విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tgtet.aptonline.in/tgtet/ResultFront ద్వారా తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.

ఇక పేపర్ల వారీగా చూసుకుంటే.. పేపర్ 1 పరీక్షకు 47,224 మంది హాజరుకాగా 29,043 మంది పాస్ అయ్యారు. పేపర్ 2 లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 48,998 మంది పరీక్ష రాయగా 17,574 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక పేపర్ 2 సోషల్ స్టడీస్ కోసం 41,207 మంది ఎగ్జామ్ రాయగా 13,075 మంది అర్హత సాదించారు.

మీ టెట్ రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgtet.aptonline.in/tgtet/ResultFront లోకి వెళ్ళాలి
  • అక్కడ హాల్ టికెట్ నెంబర్, అప్ప్లైడ్ ఎగ్జామ్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేయాలి.
  • ఎంటర్ చేయగానే మీ టెట్ ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • భవిష్యత్తు అవసరాల కోసం రిజల్ట్స్ కార్డ్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.