IAF Job Notification: బంపర్ ఆఫర్.. వాయుసేనలో అగ్నివీర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

IAF Job Notification: భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాల కోసం నోటిషికేషన్‌ విడుదల చేశారు.

IAF Job Notification: బంపర్ ఆఫర్.. వాయుసేనలో అగ్నివీర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం

Air force jobs notification

Updated On : June 27, 2025 / 11:49 AM IST

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన వాయుసేన అగ్నిపథ్‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాల కోసం నోటిషికేషన్‌ విడుదల చేశారు. ఈమేరకు ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన పెళ్లికాని పురుష, మహిళా అభ్యర్థులు జులై 11 నుంచి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ ఇంటర్‌ ఒకేషనల్‌ లేదా మూడేళ్ల ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక దారుఢ్యం/ వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 02-07-2005 నుంచి 02-01-2009 మధ్య జన్మించి ఉండాలి.

ఎత్తు: పురుషులు/ మహిళలు 152 సెం.మీటర్ల ఎత్తు ఉండాలి. ఈశాన్య, ఉత్తరాఖండ్‌ కొండ ప్రాంతాల మహిళా అభ్యర్థులు 147 సెం.మీటర్ల ఎత్తు ఉండాలి.

ఎంపిక విధానం: ఫేజ్-1లో ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఫేజ్-2లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, అడాప్టబిలిటీ టెస్ట్-1, అడాప్టబిలిటీ టెస్ట్-2 ఉంటుంది. ఫేజ్-3లో మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ తరువాత ధ్రువపత్రాల పరిశీలన వంటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రుసుము వివరాలు: రూ.550 తోపాటు జీఎస్‌టీ కట్టాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  •  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 11-07-2025 నుంచి మొదలవుతుంది.
  •  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కి 31-07-2025 చివరి తేదీ.
  • ఆన్‌లైన్ పరీక్షలు 25-09-2025 న ప్రారంభం అవుతాయి.