BIRED Self Employment Training : రాజేంద్రనగర్ లోని బీఐఆర్‌ఈడీలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కోర్సుకు బీకాం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగిలిన కోర్సులకు పదో తరగతి పాసైతే సరిపోతుంది. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు అనర్హులు.

BIRED Self Employment Training : రాజేంద్రనగర్ లోని బీఐఆర్‌ఈడీలో నిరుద్యోగ యువకులకు ఉపాధి కోర్సుల్లో శిక్షణ

BIRED Self Employment Training

Updated On : June 25, 2023 / 12:13 PM IST

BIRED Self Employment Training : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్(బీఐఆర్‌ఈడీ) నిరుద్యోగ యువకులకు శుభవార్త అందించింది. 2023-24 సంవత్సరానికి స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

READ ALSO : Drip Irrigation System : వ్యవసాయంలో పెరుగుతున్న మైక్రో ఇరిగేషన్ వాడకం !

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చెందిన నిరుద్యోగ పురుష అభ్యర్ధులు ఎవరైనా ఈ ఉపాధి శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ సర్వీసింగ్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ రిపేర్, అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ విత్‌ జీఎస్‌టీ తదితర వాటిలో శిక్షణ నిస్తారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి అకౌంటింగ్ ప్యాకేజీ టాలీ కోర్సుకు బీకాం డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మిగిలిన కోర్సులకు పదో తరగతి పాసైతే సరిపోతుంది. ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు అనర్హులు. అభ్యర్ధులు 19 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

READ ALSO : Organic Farmer : టీచింగ్ వదిలేసి.. ప్రకృతి వ్యవసాయం

మొదట వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తులు అధికంగా వస్తే మాత్రం పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచిత భోజన సదుపాయంతోపాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. శిక్షణ వ్యవధి 37 రోజులపాటు ఉంటుంది. మొత్తం సీట్ల సంఖ్య 75.

ఆసక్తి కలిగిన ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీగా జులై 3, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bired.org/ పరిశీలించగలరు.