TS inter results 2026: రేపే ఇంటర్ ఫలితాలు.. కే కేశవరావు చేతుల మీదుగా విడుదల.. ఎన్ని గంటలకు అంటే.. ఇక్కడ చెక్ చేసుకోండి
ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 4,89,126.. రెండో సంవత్సరం విద్యార్థుల సంఖ్య 5,07,949.
TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఫలితాల విడుదలపై అధికారిక ప్రకటన వచ్చేసింది. రిజల్ట్స్ విడుదల తేదీ, సమయంపై ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన చేసింది.
ఇంటర్ ఫలితాలు రేపు (ఏప్రిల్ 12) విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ (జనరల్ అండ్ వొకేషనల్) ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డ్ ప్రకటించనుంది. ప్రభుత్వ సలహాదారు కేశవ రావు, సెక్రటరీ యోగితా రాణా చేతుల మీదుగా ఫలితాల విడుదల ఉంటుంది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో ఫలితాలను రిలీజ్ చేయనున్నారు.
ఫలితాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. అధికారిక వెబ్సైట్లు tgbie.cgg.gov.in, results.cgg.gov.in విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 9,70,075 మంది స్టూడెంట్స్ ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం విద్యార్థుల సంఖ్య 4,89,126.. రెండో సంవత్సరం విద్యార్థుల సంఖ్య 5,07,949.
Also Read: టెట్ రాసేందుకు సిద్ధమవుతున్నవారికి గుడ్న్యూస్.. నోటిఫికేషన్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?
