TS TET Answer Key 2024 : టీఎస్ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఆన్సర్ కీ 2024లో అభ్యంతరాలు ఉన్నాయా? గడువు తేదీలోగా ఇలా తెలియజేయండి!
TS TET Answer Key 2024 : టీస్ టెట్ పరీక్ష 2024కు సంబంధించి ఆన్సర్ కీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఆన్సర్ కీలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 27 చివరి తేదీలో తెలపాల్సి ఉంటుంది.

TS TET Answer Key 2024
TS TET Answer Key 2024 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ ఉపాధ్యాయుల అర్హత పరీక్ష లేదా (TS TET 2024) ఆన్సర్ కీ అభ్యంతరాలు తెలిపేందుకు ఈరోజు (జనవరి 27) గడువు తేదీ. ఈ సంవత్సరం టీఎస్ టెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు దీని ద్వారా ఆన్సర్ కీని చెక్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం టెట్ అభ్యర్థులు (tgtet2024.aptonline.in) వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయాలి.
టీఎస్ టెట్ 2024 జవాబు కీని సవాలు చేసేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి, అవసరమైన రుసుమును చెల్లించాలి. లేవనెత్తిన సవాళ్ల ఆధారంగా, అధికార యంత్రాంగం అవసరమైన మార్పులు చేసి ఫైనల్ ఆన్సర్ కీని వెల్లడిస్తుంది. సమాచార బులెటిన్ ప్రకారం.. టీఎస్ టెట్ ఫలితాలు 2024 ఫిబ్రవరి 5, 2025న విడుదల కానున్నాయి.
టీఎస్ టెట్ ఆన్సర్ కీ 2025 అభ్యంతరాలను తెలపడం ఎలా? :
- టీజీ టెట్ అధికారిక వెబ్‌సైట్ (tgtet2024.aptonline.in)ను విజిట్ చేయండి.
- హోమ్ పేజీలో “Provisional Answer Key” లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ జర్నల్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ చేయండి.
- ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసి, జాగ్రత్తగా చెక్ చేయండి.
- అభ్యంతరాలను తెలియజేయాలన్నా , మీరు సవాలు చేయాలనుకుంటున్న ప్రశ్నను ఎంచుకోండి.
- సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయండి.
- అవసరమైన రుసుము చెల్లించి సమర్పించండి.
- ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కన్ఫార్మ్ పేజీ నుంచి ప్రింట్ అవుట్ తీసుకోండి.
రెండు షిప్ట్‌లలో టెట్ పరీక్షలు :
జనవరి 2 నుంచి 20 వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరిగాయి. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి.
ఈసారి టీజీ టెట్‌కు దాదాపు 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లు ఉండేవి. 1వ తరగతి నుంచి 5 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే అభ్యర్థులు పేపర్ ఒకటి, 6వ తరగతి నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా ఉండాలనుకునే వారు పేపర్ II ఎంపిక చేసుకుంటారు.
టెట్ సర్టిఫికేషన్‌కు లైఫ్‌టైమ్ వ్యాలిడిటీ :
పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. బీసీ కేటగిరీకి చెందినవారు కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు ఉత్తీర్ణత 40 శాతం పొందాలి.
టీచర్ ఉద్యోగాల భర్తీలో టెట్‌లో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఇకపై ప్రతి ఏడాదిలో టెట్‌ను నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టీఎస్ టెట్ సర్టిఫికేషన్‌కు ఏడేళ్ల వ్యాలిడీటీ ఉండగా ఇప్పుడు అది లైఫ్ టైమ్ వ్యాలిడీటీ ఉంటుంది.