RRB NTPC Exam Date 2024 : ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ, పీజీ ఎగ్జామ్ షెడ్యూల్ త్వరలో విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..!
RRB NTPC Exam Date 2024 : ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ, గ్రాడ్యుయేట్-లెవల్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లలో త్వరలో ప్రకటిస్తాయని భావిస్తున్నారు.

RRB NTPC Exam Date 2024
RRB NTPC Exam Date 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు (RRBs) త్వరలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి తేదీలు, అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేయనున్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ యూజీ, గ్రాడ్యుయేట్-లెవల్ పరీక్షలకు సంబంధించిన పరీక్ష తేదీలను ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లలో త్వరలో ప్రకటిస్తాయని భావిస్తున్నారు. పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు సంబంధిత అధికారి విడుదల చేసిన తర్వాత సంబంధిత ప్రాంతీయ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ల ద్వారా వివరణాత్మక పరీక్ష షెడ్యూల్‌ను చెక్ చేయొచ్చు.
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 11558 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 8,113 గ్రాడ్యుయేట్-లెవల్ పోస్టులకు, 3,445 అండర్ గ్రాడ్యుయేట్-లెవల్ పోస్టులకు ఉన్నాయి.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ 2024 పరీక్ష తేదీలు అధికారికంగా ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు సంబంధిత ప్రాంతీయ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌ల ద్వారా వివరణాత్మక పరీక్ష షెడ్యూల్‌ను యాక్సస్ చేయొచ్చు. ప్రత్యామ్నాయంగా మీరు ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష తేదీ 2024 నోటీసు పీడీఎఫ్ అప్‌లోడ్ చేసిన తర్వాత, దిగువ ఇచ్చిన లింక్ ద్వారా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష తేదీ 2025 నోటీసు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
అభ్యర్థులు కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసేందుకు ఈ కింది దశలను చెక్ చేయవచ్చు.
- మీరు దరఖాస్తు చేసిన ఆర్ఆర్‌బీ రీజియన్ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
- ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ కాల్ లెటర్ (అడ్మిట్ కార్డ్) లింక్‌పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఆర్‌ఆర్‌బీ రీజియన్ ఎంచుకోండి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
- “Submit” బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష తేదీ 2024 pdf స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది.
- షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేయండి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకోండి.
ఆర్ఆర్‌బీ ప్రాంతీయ వెబ్‌సైట్ల జాబితా :
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) త్వరలో ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించిన తర్వాత వారి హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మీ హాల్ టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ముందు ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ వివరాలు ఇలా ఉన్నాయి. అయితే, అధికారిక వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన ఏదీ అందుబాటులో లేదు. గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ 1 పరీక్ష 2025 మార్చి-ఏప్రిల్ 2025లో నిర్వహించనుంది.
Read Also : UGC NET 2024 Admit Card : యూజీసీ నెట్ 2024 అడ్మిట్ కార్డు విడుదల.. ఏయే తేదీల్లో పరీక్ష జరగనుందంటే?