యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025.. అప్లికేషన్ల గడువు ముగుస్తోంది..
ఎంపికైన అభ్యర్థులకు బ్యాలెట్ ముగిసిన 2 వారాల్లో సమాచారం ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేరు, పుట్టినతేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్, పాస్‌పోర్ట్ స్కాన్‌ను సమర్పించాలి.

యుకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025ను ప్రకటించింది యూకే ప్రభుత్వం. ఈ స్కీమ్ ద్వారా 3,000 భారతీయులకు యునైటెడ్ కింగ్డమ్‌లో 2 సంవత్సరాలు ఉండేందుకు, పనిచేసుకునేందుకు, చదువుకునేందుకు, ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న వారు gov.uk వెబ్‌సైట్‌లో ఉచిత బ్యాలెట్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ బ్యాలెట్ జూలై 24న మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ముగుస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు బ్యాలెట్ ముగిసిన 2 వారాల్లో సమాచారం ఇస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పేరు, పుట్టినతేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్, పాస్‌పోర్ట్ స్కాన్‌ను సమర్పించాలి. ర్యాండమ్ డ్రా ద్వారా ఎంపికైన వారికి మాత్రమే వీసా దరఖాస్తు చేసేందుకు ఈ-మెయిల్ ద్వారా ఆహ్వానం వస్తుంది.
ఇన్విటేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు 90 రోజుల్లో ఆన్‌లైన్ వీసా దరఖాస్తు చేయాలి. బయోమెట్రిక్ ధ్రువీకరణ చేసుకుని, అవసరమైన ఫీజు చెల్లించాలి. వీసా దరఖాస్తు తేదీకి ముందు 31 రోజులలో, వరుసగా 28 రోజుల పాటు అవసరమైన డబ్బు ఖాతాలో ఉండాలి. దరఖాస్తు ఫీజు £319 ఉంది. హెల్త్‌కేర్ సర్‌చార్జ్ కూడా చెల్లించాలి. దరఖాస్తు తిరస్కరణకు గురైతే వీసా ఫీజును తిరిగి ఇవ్వరు. యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా ఉన్నవారు దరఖాస్తులకు అర్హులు కాదు.
Also Read: సామాన్యుడికి షాక్.. కూరగాయల ధరలు పెరిగే ఛాన్స్.. ఎందుకంటే?
ఇలా దరఖాస్తు చేయవచ్చు?
- భారతీయ పౌరులు అయి ఉండాలి.. ప్రయాణ సమయానికి వయసు 18-30 మధ్య ఉండాలి
- యూకే గుర్తించిన బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ అర్హత ఉండాలి
- కనీసం £2,530 (సుమారు రూ.2,70,824) వ్యక్తిగత సేవింగ్స్ ఖాతాలో ఉండాలి
- వరుసగా 30 రోజుల పాటు ఖాతాలో కనీసం రూ.2,50,000 ఉండాలి
- 18 సంవత్సరాలలోపు వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు