UPSC ESE Vacancy 2026: UPSC 474 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 26న ప్రారంభమైంది.

UPSC ESE Vacancy 2026: UPSC 474 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, ఎంపిక విధానం పూర్తి వివరాలు..

Updated On : September 27, 2025 / 10:13 PM IST

UPSC ESE Vacancy 2026: ఇంజినీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్ సీ. మొత్తం పోస్టుల సంఖ్య 474. పోస్టును బట్టి డిప్లొమా, ఇంజినీరింగ్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్), M.Sc చేసిన వారు అర్హులు. వయసు 21-30 ఏళ్లు ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. ఆన్‌లైన్ లో పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ESE) 2026 లో సుమారు 474 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు UPSC ప్రకటించింది. వివిధ ప్రభుత్వ విభాగాలలో గ్రేడ్ ‘A’, గ్రేడ్ ‘B’ అధికారులు కావాలనుకునే అభ్యర్థులకు ఇవి ముఖ్యమైన పోస్టులు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు సెప్టెంబర్ 26న ప్రారంభమైంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 16 సాయంత్రం 6 గంటలలోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఈ ఉద్యోగాలకు మొదటి పరీక్ష (ప్రిలిమ్స్/స్టేజ్-I) ఫిబ్రవరి 8, 2026న జరగనుంది.