ఇంటర్ అర్హత : UPSC లో ఉద్యోగాలు

నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నావెల్ అకాడమీ(NA) ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ ను బుధవారం(జనవరి 8, 2020) విడుదల చేసింది. ఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అందులో భాగంగా జనవరి 8, 2020 మెుదటి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాల వారీగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ లోని ఖాళీలను భర్తీ చేయనుంది. మెుత్తం 418 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు :
నేషనల్ డిఫెన్స్ అకాడమీ :
ఆర్మీ – 208
నేవీ – 42
ఎయిర్ ఫోర్స్ – 120
నావెల్(క్యాడెట్ ఎంట్రీ) – 48
విద్యార్హత : అభ్యర్దులు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను ఇంటర్ లో కలిగి ఉండాలి.
వయస్సు : అభ్యర్దులు జూలై 2,2001 నుంచి జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC, ST అభ్యర్దులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదిలు :
దరఖాస్తు ప్రారంభ తేది : జనవరి 8, 2020.
దరఖాస్తు చివరి తేది : జనవరి 28, 2020.
పరీక్ష తేది : ఏప్రిల్ 19, 2020.