AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా 11 నవంబరు 2022 నిర్ణయించారు.

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ

AP High Court Recruitment :

Updated On : October 23, 2022 / 5:24 PM IST

AP High Court Recruitment : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 కేటగిరిలలో మొత్తం 3600 పోస్టులను భర్తీ చేయనున్నారు. హైకోర్టులో ఖాళీలకు సంబంధించి సెక్షన్ ఆఫీసర్ / కోర్టు ఆఫీసర్ / సెక్యూరిటీ ఆఫీసర్ / అకౌంట్ ఆఫీసర్ పోస్టులు 09 ఖాళీగా ఉన్నాయి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 13 ఖాళీగా ఉన్నాయి. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు11, ఓవర్ సీర్ పోస్టులు 1 , అసిస్టెంట్స్ అండ్ ఎగ్జామినర్ పోస్టులు 27 , టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులు 36, అసిస్టెంట్ ఓవర్ సీర్ పోస్టులు 1, డ్రైవర్ పోస్టులు135, స్టెనోగ్రాఫర్ పోస్టులు 170, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు113, కాపీయిస్ట్ పోస్టులు 209, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 20 , ప్రాసెస్ సర్వర్ పోస్టులు 1520, ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులు,1655 ఖాళీలు ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే అనంతపురం 92, చిత్తూరు 168, తూర్పు గోదావరి 156, గుంటూరు 147, వైఎస్ఆర్ కడప 83, కృష్ణ 204. కర్నూలు 91, నెల్లూరు 104, ప్రకాశం 98, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 125, విజయనగరం 57, పశ్చిమ గోదావరి 108 ఖాళీలు ఉన్నాయి. జనరల్ , బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.800 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. కనీస వయస్సు 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలుగా నిర్ణయించారు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఆఫీస్ సబ్ ఆర్టినేట్ పోస్టుల వివరాల్లోకి వెళ్తే.. అర్హత .. కనీసం ఏడో తరగతి పూర్తి చేసి.. తెలుగు రాయడం, చదవడం వస్తే సరిపోతుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా 11 నవంబరు 2022 నిర్ణయించారు. ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులకు సంబంధించి పోస్టులు 135 ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ అనేది అక్టోబర్ 29, 2022 నుంచి నవంబర్ 15, 2022 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; www.hc.ap.nic.in పరిశీలించగలరు.