NIE Recruitment : ఐసీఎంఆర్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ఖాళీ పోస్టుల భర్తీ

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 - రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 - 56,900 వరకు జీతం చెల్లిస్తారు.

NIE Recruitment : ఐసీఎంఆర్‌ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీలో ఖాళీ పోస్టుల భర్తీ

Career Opportunity

Updated On : September 29, 2023 / 10:06 AM IST

NIE Recruitment : చెన్నైలోని ఐసీఎంఆర్‌- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన మొత్తం 47 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్, ల్యాబొరేటరీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ

ఖాళీల వివరాలకు సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్: 33 పోస్టులు, ల్యాబొరేటరీ అటెండెంట్: 14 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. బయోస్టాటిస్టిక్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామర్, ల్యాబొరేటరీ, రిసెర్చ్ మేనేజ్‌మెంట్, కమ్యూనికేషన్, సోషల్ సైన్స్, పబ్లిక్ హెల్త్, ఫీల్డ్ యాక్టివిటీస్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టును అనుసరించి పదోతరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

READ ALSO : Indian Army : రూ.6,500కోట్లతో 400 ఫిరంగి తుపాకుల కొనుగోలుకు ఆర్మీ ఒప్పందం

రాత పరీక్ష ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.35,400 – రూ.1,12,400. ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులకు రూ.18,000 – 56,900 వరకు జీతం చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://nie.gov.in/ పరిశీలించగలరు.