AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగ ఖాళీ భర్తీ

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగ ఖాళీ భర్తీ

AIIMS Recruitment

Updated On : May 19, 2023 / 3:02 PM IST

AIIMS Recruitment : రాయ్ పూర్ ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌లో ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌లో ఉద్యోగ ఖాళీ భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 116 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న టీచింగ్ పోస్టులు రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. అనాటమీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో ఈ టీచింగ్‌ పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Curd With Raisins : ఆరోగ్యకరమైన ఎముకలు, కీళ్ళ కోసం పెరుగులో ఎండుద్రాక్ష కలిపి తీసుకోండి !

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీల ఆధారంగా సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది.

READ ALSO : Blood Pressure : రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు !

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్‌ 16ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.aiimsraipur.edu.in/ పరిశీలించగలరు.