Vacancy Notification : ఏపి టెలీమెడిసన్ హబ్స్ లో ఖాళీల భర్తీ నోటిఫికేషన్
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ళ మధ్య ఉండాలి. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

Jobs (2)
Vacancy Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 14 టెలిమెడిసిన్ హబ్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఒప్పంద ప్రాతిపదికన ఆయా ఉద్యోగాల నియామకం చేపట్టనున్నారు. డాక్టర్లు, స్పెషలిస్టుల పోస్టులకు సంబంధించి మొత్తం 70 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
విభాగాల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే పిడియాట్రీషియన్ 14, గైనకాలజిస్ట్ 14, జనరల్ ఫిజీషియన్ 14, మెడికల్ ఆఫీసర్లు 28 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతకు సంబంధించి ఎంబీబిఎస్, సంబంధిత స్పెషలైజేషన్ లో పోస్టు గ్రాడ్యుయేట్ , డిగ్రీ లేదా డిప్లోమా ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీఎంసీలో రిజిస్టర్ అయిఉండాలి.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 45 ఏళ్ళ మధ్య ఉండాలి. అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ అధారంగా ఎంపిక విధానం ఉంటుంది. ధరఖాస్తు ప్రక్రియ ఆన్ లైన్ విధానంలో ఉంటుంది. ధరఖాస్తులను ఈ మెయిల్ కు పంపాల్సి ఉంటుంది. ఈ మెయిల్ వివరాలకు సంబంధించి spmuaprect@gmail.comకు పంపాలి. ధరఖాస్తుకు చివరి తేది 2021 సెప్టెంబరు 6గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://hmfw.ap.gov.in పరిశీలించగలరు.