BLW Apprentice Recruitment : బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్‌ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 25.11.2023గా నిర్ణయించారు.

BLW Apprentice Recruitment : బెనారస్ లోకోమోటివ్ వర్క్స్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

Railway BLW Varanasi

Updated On : November 5, 2023 / 2:37 PM IST

BLW Apprentice Recruitment : ఇండియన్ రైల్వేకు చెందిన బెనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ)లో 2022-23 ఏడాదికి అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 374 అప్రెంటిస్‌ శిక్షణ కోసం భర్తీ చేయనున్నారు. వీటిలో ఐటీఐ అప్రెంటిస్ 300 పోస్టులు, నాన్ ఐటీఐ అప్రెంటిస్‌ 74 పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Heart Healthy : బీట్‌రూట్ , బచ్చలికూర జ్యూస్ తో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడే 5 పానీయాలు !

ట్రేడ్లవారీగా ఖాళీలు

ఐటీఐ అప్రెంటిస్ ;

ఫిట్టర్ – 107 , కార్పెంటర్ – 03 , పెయింటర్ (జనరల్) – 07 ,మెషినిస్ట్ – 67 ,వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్) – 45 , ఎలక్ట్రీషియన్ – 71 ఉన్నాయి. 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలవరకు వయోసడలింపు ఉంటుంది.

READ ALSO : Pistachio For Blood Sugar : పిస్తాలు రక్తంలో చక్కెరను తగ్గిస్తాయా ? వాటిని మీ ఆహారంలో ఎలా చేర్చుకోవాలంటే..

నాన్ ఐటీఐ అప్రెంటిస్‌ ;

ఫిట్టర్ – 30, మెషినిస్ట్ – 15, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్) – 11 ,ఎలక్ట్రీషియన్ – 18 ఉన్నాయి. 50 శాతం మార్కులతో పదోతరగతి అర్హత ఉండాలి. వయోపరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలవరకు వయోసడలింపు ఉంటుంది.

READ ALSO : Thyroid Problems : థైరాయడ్ సమస్యతో బాధపడుతున్నవారు తీసుకునే ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

దరఖాస్తు విధానం ;

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపిక విధానానికి సంబంధించి అకడమిక్‌ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది 25.11.2023గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు చివరితేది 27.11.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://blw.indianrailways.gov.in/ పరిశీలించగలరు.