AIIMS Kalyani Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళ్యాణిలో పలు పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

AIIMS Kalyani Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళ్యాణిలో పలు పోస్టుల భర్తీ

AIIMS Kalyani

Updated On : September 27, 2023 / 11:44 AM IST

AIIMS Kalyani Recruitment : పశ్చిమబెంగాల్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కళ్యాణిలో గ్రూప్‌-బి, గ్రూప్‌-సి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్త చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : CIPET JOBS : సీపెట్‌ భోపాల్‌లో లెక్చరర్ పోస్టుల భర్తీ

ఖాళీల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్: 01, డైటీషియన్: 04, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్: 15, హిందీ ఆఫీసర్: 01, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్: 03, జూనియర్ ఇంజినీర్: 06, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్: 02, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్: 02, మెడికల్ సోషల్ వర్కర్: 01, ఆప్టొమెట్రిస్ట్: 02, , పీఏ-ప్రిన్సిపల్: 02,

అలాగే టెక్నీషియన్: 01, టెక్నీషియన్ (ల్యాబొరేటరీ): 32, క్యాషియర్: 01, లాండ్రీ సూపర్‌వైజర్: 02, లోయర్ డివిజన్ క్లర్క్: 26, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 10, స్టెనోగ్రాఫర్: 05, అప్పర్ డివిజన్ క్లర్క్: 03 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : TS TET Results 2023: టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు18-35 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక స్కిల్‌టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimskalyani.edu.in/ పరిశీలించగలరు.