TS TET Results 2023: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..

ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల నిర్వహణ కోసం 2052 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకోసం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TS TET Results 2023: తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..

TS TET 2023 Results

TS TET Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు వచ్చేశాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేసినట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి వెల్లడించారు. ఫలితాలను తుది ‘కీ’తో పాటు అధికారులు విడుదల చేశారు. ఫలితాలకోసం tstet.cgg.gov.in అనే అధికారిక వెబ్ సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. టెట్ పేపర్ -1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు, పేపర్ -2 ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హులు.

ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల నిర్వహణ కోసం 2052 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కోసం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1కు 2.26 లక్షల మంది, పేపర్-2 పరీక్షకు 1.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్ లో క్వాలిఫై కావడం తప్పనిసరి అని తెలిసిందే. టెట్ అర్హత కాలపరిమితి జీవితం కాలం ఉంటుంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 20 నుంచి 30 వరకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) జరగనుంది.

టెట్ ఫైనల్ కీ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి