వైజాగ్ స్టీల్ ప్లాంటులో టెక్నికల్ ట్రైనీ ఉద్యోగాలు

  • Published By: veegamteam ,Published On : January 24, 2020 / 09:06 AM IST
వైజాగ్ స్టీల్ ప్లాంటులో టెక్నికల్ ట్రైనీ ఉద్యోగాలు

Updated On : January 24, 2020 / 9:06 AM IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో టెక్నికల్ మేనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 188 ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు సంవత్సరం పాటు ట్రైనింగ్ ఉంటుంది. 

విభాగాల వారీగా ఖాళీలు :
సిరామిక్స్ – 4
– కెమికల్ – 26
సివిల్ – 5
ఎలక్ట్రికల్ – 45
ఎలక్ట్రానిక్స్ – 10
మెకానికల్ – 77
మెటాలార్జీ -19
మైనింగ్ – 2

విద్యార్హత : అభ్యర్ధులు 60 శాతం మార్కులతో బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.590 చెల్లించాలి. దివ్యాంగులు, SC, ST అభ్యర్ధులు రూ.295 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపికా విధానం : అభ్యర్ధులను కంప్యూటర్ బేస్ టెస్ట్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వయస్సు : అభ్యర్ధుల వయస్సు జనవరి 1, 2020 నాటికి 27 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. 

జీతం : ఎంపికైన అభ్యర్దులకు నెలకు రూ.20వేల 600 నుంచి 46వేల 500 ఇస్తారు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 24, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 13, 2020.
దరఖాస్తు పేమెంట్ చివరి తేదీ : ఫిబ్రవరి 14, 2020.