Santoor Scholarship : విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ స్కాలర్‌షిప్‌లు..దరఖాస్తుకు ఎవరు అర్హులంటే?

విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ విప్రో కేర్స్‌తో కలిసి 2016-17లో  సంతూర్‌ స్కాలర్‌షిప్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏదైనా డిగ్రీ చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.

Santoor Scholarship : విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ స్కాలర్‌షిప్‌లు..దరఖాస్తుకు ఎవరు అర్హులంటే?

Santoor Scholarship

Updated On : November 4, 2022 / 4:31 PM IST

Santoor Scholarship : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన నిరుపేద విద్యార్థినులకు విప్రో మంచి శుభవార్తనందించింది. విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ స్కాలర్‌షిప్‌ల ద్వారా తమవంతు ఆర్దిక సహాయంను ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలా మంది అమ్మాయిలు తగినంత ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడే వారికి ఆర్ధిక సాయం అందించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరానికి 2022-23 గాను పేద విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విప్రో కన్జ్యూమర్ కేర్‌ సంస్థ విప్రో కేర్స్‌తో కలిసి 2016-17లో  సంతూర్‌ స్కాలర్‌షిప్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏదైనా డిగ్రీ చదవాలనుకునే నిరుపేద విద్యార్థినులకు తమ వంతు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేవరకు సంవత్సరానికి 24 వేల రూపాయల చొప్పున అందిస్తారు. ఈ మొత్తాన్ని ట్యూషన్‌ ఫీ లేదా చదువుకు సంబంధించిన ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే వారి అర్హతల విషయానికి వస్తే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. 2021-22 విద్యా సంవత్సరాన్ని ప్రభుత్వ పాఠశాల/జూనియర్‌ కాలేజీలో పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులో నమోదు చేసుకుని ఉండాలి. ఫీజు చెల్లించిన రశీదులు, కాలేజీ అడ్మిషన్ లెటర్‌, ఐడీ కార్డు, బోనఫైడ్‌ సర్టిఫికెట్‌‌ను స్కాలర్‌షిప్ అప్లికేషన్‌తోపాటు జతచేయాల్సి ఉంటుంది. కోర్సు కాలపరిమితి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. సంతూర్‌ స్కాలర్‌షిప్‌ కోసం దరఖాస్తుకు నవంబర్ 15, 2022 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://santoorscholarships.com/ పరిశీలించగలరు.