Kharge to PM: మోదీకి ఏమైనా 100 తలలు ఉన్నాయా? ఖర్గే ఇలా ఎందుకు ప్రశ్నించారంటే..?

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాదు, ఆయన ప్రచార మంత్రి. బహుశా ఆయనను ఎన్నికల ప్రచార మంత్రిగా నియమించాలి. ఎందుకంటే, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కనిపిస్తారు. కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికలో మోదీ కనిపిస్తారు. అంతటా ఆయన గురించి ఆయనే చెప్పుకుంటారు

Kharge to PM: మోదీకి ఏమైనా 100 తలలు ఉన్నాయా? ఖర్గే ఇలా ఎందుకు ప్రశ్నించారంటే..?

Do You Have 100 Heads Like Ravan? Congress Chief's Remark On PM

Updated On : November 29, 2022 / 4:02 PM IST

Kharge to PM: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏమైనా రావణుడా? ఆయనకేమైనా 100 తలలు ఉన్నాయా అని ప్రశ్నించారు కాంగ్రస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీని మోదీని ఉద్దేశిస్తూ ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎక్కడ చూసినా మోదీయే కనిపిస్తున్నారని, ప్రజలు వాళ్ల ముఖాలు వాళ్లు చూసుకోవడం కంటే కూడా మోదీ ముఖాన్నే ఎక్కువ చూస్తున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.

CM KCR: సీఎం కేసీఆర్ దూకుడు.. అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్

ఆదివారం అహ్మదాబాద్‭లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ ‘‘నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి కాదు, ఆయన ప్రచార మంత్రి. బహుశా ఆయనను ఎన్నికల ప్రచార మంత్రిగా నియమించాలి. ఎందుకంటే, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ కనిపిస్తారు. కార్పొరేషన్ ఎన్నికల నుంచి ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికలో మోదీ కనిపిస్తారు. అంతటా ఆయన గురించి ఆయనే చెప్పుకుంటారు. మోదీని ఓటును చూసినంత బాగా మీరు ఇంకెవరినీ చూడలేరు (ర్యాలీకి వచ్చిన ప్రజలను ఉద్దేశించి). ఎన్నిసార్లు మీరు మోదీ ముఖాన్ని చూసుంటారు? బహుశా మీ ముఖాన్ని మీరు కూడా అన్నిసార్లు చూసుకుని ఉండరు. మీకేమైనా రావణుడిలా 100 తలలు ఉన్నాయా? (మోదీని ఉద్దేశించి)’’ అని అన్నారు.

Twitter: ట్విట్టర్ బ్లూటిక్ అకౌంట్ల రీవెరిఫికేషన్.. ఈ వారమే ప్రారంభిస్తామంటున్న ఎలన్ మస్క్

కాగా, ఖర్గే వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బీజేపీ నేత అమిత్ మాల్వియా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పూర్తిగా సహనం కోల్పోయి ప్రవర్తించారు. ప్రధాని మోదీని రావణుడితో పోల్చారు. మౌత్ కా సౌదాగర్ నుంచి రావణ్ వరకు, గుజరాత్ బిడ్డను కాంగ్రెస్ అవమానిస్తూనే ఉంది’’ అని ట్వీట్ చేశారు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీని ఉద్దేశించి మౌత్ కా సౌదాగర్ (మరణాల్ని వ్యాపారం చేసే వ్యక్తి) అని సోనియా అన్నారు. 2002లో జరిగిన గోద్రా అల్లర్లను ఉద్దేశించి సోనియా అలా అన్నారు. ఆ సమయంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి.

Aadhaar – Mobile Linking : మీ ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌తో లింక్ చేశారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం.. వెంటనే ఇలా చేయండి!