Man Rides Donkey: గాడిదపై ఊరేగుతూ వచ్చిన నామినేషన్ వేసిన అభ్యర్థి (వీడియో)

గాడిదపై ప్రియాంక్ సింగ్ ఎక్కి రిటర్నింగ్ ఆఫీసుకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న జనం ఆయనను అలా చూస్తూ ఉండిపోయారు. ఈ కొత్త విధానం గురించి జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు.

Man Rides Donkey: గాడిదపై ఊరేగుతూ వచ్చిన నామినేషన్ వేసిన అభ్యర్థి (వీడియో)

Updated On : October 26, 2023 / 6:25 PM IST

Assembly Elections 2023: పండుగల సీజన్‌తో పాటు మధ్యప్రదేశ్‌లో తేలికపాటి చలి కూడా ప్రారంభమైంది. ఈ చలి మధ్య రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది. ఇక ఎన్నికల జోరు తెలిసిందే. ఇందులో అభ్యర్థులు చేసే ఫీట్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రోజుకో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల రాజకీయ ప్రత్యర్థుల మధ్య వివాదాలు, మరికొన్ని చోట్ల సొంత వ్యక్తుల మధ్యే అంతర్గత పోరుతో రాజకీయ పార్టీలు ఆందోళనకు గురవుతున్నాయి. ఎన్నికల టెన్షన్‌తో కూడిన ఈ వాతావరణం మధ్య, చూపరులను అలా ఒక షాక్‌తో ఆపి, నవ్వు ఆపుకోలేని కొన్ని దృశ్యాలు కూడా ఉన్నాయి. బుర్హాన్‌పూర్ వీధుల్లో కూడా ఇలాంటిదే ఒక దృశ్యం కనిపించింది.

బుర్హాన్‌పూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా ఠాకూర్ ప్రియాంక్ సింగ్ పోటీకి దిగారు. అయితే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి నాయకులు కార్ల కాన్వాయ్‌లో పెద్ద శబ్దాలు, ఆడంబరంతో వెళతారు. అయితే ఠాకూర్ ప్రియాంక్ సింగ్ మాత్రం వినూత్న రీతిలో కనిపించారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి ఆయన వచ్చిన తీరు ఎక్కువగా చర్చనీయాంశమైంది. నిజానికి ప్రియాంక్ సింగ్ తన నామినేషన్ ఫారమ్‌ను సమర్పించేందుకు గాడిదపై ఊరేగుతూ వచ్చారు. ఆయన మద్దతుదారులు కూడా ర్యాలీగా వచ్చారు.


గాడిదపై ప్రియాంక్ సింగ్ ఎక్కి రిటర్నింగ్ ఆఫీసుకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న జనం ఆయనను అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు బుర్హాన్‌పూర్ వీధుల్లో గాడిదపై సవారీ చేస్తూ నామినేషన్లు దాఖలు చేసే ప్రత్యేక శైలి కూడా ఎన్నికల చర్చల్లో భాగమైంది. ఈ కొత్త విధానం గురించి జనాలు చాలా మాట్లాడుకుంటున్నారు. నిజానికి బుర్హాన్‌పూర్‌ ఎన్నికలు ఇప్పటికే ఆసక్తికరంగా సాగుతుండగా, ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఆ ప్రాంతంలో ఎన్నికల వాతావరణానికి మరింత రంగులు అద్దుతున్నాయి.