Karnataka Polls: గంట లేటయిందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‭ను బాయ్‭కాట్ చేసిన మీడియా

డీకే శివకుమార్ ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనను మీడియా బాయ్‭కాట్ చేసింది. అందుకు బహిరంగంగానే మీడియాపై బెదిరింపు చేస్తున్నారు. ఆసలస్యంగా రావడం ఆయనకు ఇది కొత్త కాదు. ముందు ఆయన తీరు మార్చుకోవాలి

Karnataka Polls: గంట లేటయిందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‭ను బాయ్‭కాట్ చేసిన మీడియా

DK Shivakumar

Updated On : April 26, 2023 / 8:07 AM IST

Karnataka Polls: మీడియా సమావేశానికి ఒక గంట ఆలస్యమైందని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‭ను కన్నడ మీడియా బాయ్‭కాట్ చేసింది. ఆయనకు సంబంధించిన న్యూస్ కవరేజ్ చేయవద్దని నిర్ణయం తీసుకుంది. అయితే మీడియా తీసుకున్న ఈ నిర్ణయంపై డీకే అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సందర్భాలు ఒకేలా ఉండవని, కొన్నిసార్లు ఆలస్యం అవుతుందని వివరణ ఇచ్చుకున్నారు. ఆయన హెలికాప్టర్‭లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల మీడియా సమావేశానికి ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Operation Kaveri: సుడాన్ నుంచి భారతీయులను తరలించేందుకు ఆపరేషన్ కావేరీ.. తొలి బ్యాచ్‌లో 278 మంది

కాగా, ఈ విషయమై డీకే స్పందిస్తూ ‘‘అన్ని అనుకున్న సమయంలో జరగడం సాధ్యం కాదు. మీడియా సమావేశం ఎప్పుడుందో నాకు తెలుసు, కొన్ని ఎంత ముఖ్యమో తెలుసు, మీరు (మీడియా) ఎప్పుడు వచ్చారో కూడా తెలుసు. అలా అని నన్ను బ్లాక్‭మెయిల్ చేయాలని చూడకండి’’ అని అన్నారు. అనంతరం, బాయ్‭కాట్‭కు పిలుపునిచ్చిన రిపోర్టర్ల పేర్లు ఇవ్వమని, ఆ మీడియా సంస్థల ప్రతినిధులతో తాను మాట్లాడతానని తన వ్యక్తిగత మీడియా కోర్డినేటరును డీకే అడిగారు.

Chandrababu Naidu : సంక్షేమం పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 లాక్కుంటున్నారు, అధికారంలోకి వస్తే వాటి ఛార్జీలు తగ్గిస్తా-చంద్రబాబు

డీకే శివకుమార్ మీడియాను బెదిరిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్విట్టర్‭లో ఓ వీడియోను షేర్ చేస్తూ ‘‘డీకే శివకుమార్ ఆలస్యంగా వచ్చారు. అందుకే ఆయనను మీడియా బాయ్‭కాట్ చేసింది. అందుకు బహిరంగంగానే మీడియాపై బెదిరింపు చేస్తున్నారు. ఆసలస్యంగా రావడం ఆయనకు ఇది కొత్త కాదు. ముందు ఆయన తీరు మార్చుకోవాలి. అందరు జర్నలిస్టులు వైన్ కోసం తమ ఆత్మను చంపుకోరు. చాలా మందికి వెన్నెముక ఉంది’’ అని ట్వీట్ చేశారు.

AP CM Jagan: అనంతపురం జిల్లాకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇలా.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన నిధులు

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.