PM Modi: బీజేపీ అభ్యర్థిని కాదు, కమలాన్ని గుర్తుంచుకోండి.. ఎన్నికల ప్రచారంలో మోదీ
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నారు. కానీ 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పరిస్థితులు చక్కబడ్డాయని, కేవలం ప్రజల సాధికారతపైనే ప్రభుత్వం పని చేస్తోందని మోదీ అన్నారు.

Only remember the symbol of Lotus says PM Modi in Solan
PM Modi: భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కాకుండా కేవలం కమలం చిహ్నాన్ని గుర్తుంచుకోవాలని హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శనివారం సోలన్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కమలం గుర్తు ద్వారానే తాను ప్రజల వద్దకు రాగలిగానని, కమలం గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ బీజేపీ ఉంటుందని, అక్కడికి తాను ఒస్తానని ఆయన అన్నారు.
‘‘యూరియా ధరలు 2,000 రూపాయలకు పైగానే ఉండేవి. కానీ రైతుల కోసం వాటి ధరను తగ్గించాం. ఇప్పుడు వాటిని 250 రూపాయల కంటే ధరకే అందిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని మా ప్రభుత్వం భరిస్తోంది. కొంత మంది ధరపై 100 రూపాయల సబ్సిడీ ఇచ్చి 1,000 రూపాయలతో ప్రకటనలు చేసేవారు’’ అంటూ కాంగ్రెస్ పార్టీపై మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాలను మార్చడంలోనే నాయకులు తలమునకలై ఉండేవారని, చిన్న రాష్ట్రాలు వారి లక్ష్యాలకు ఎక్కువగా బలయ్యేవని ఆయన అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నారు. కానీ 2014లో తమ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం పరిస్థితులు చక్కబడ్డాయని, కేవలం ప్రజల సాధికారతపైనే ప్రభుత్వం పని చేస్తోందని మోదీ అన్నారు.
Chennai: తమిళనాడులో ఆర్ఎస్ఎస్ మార్చ్ రద్దు.. కోర్టు తీర్పును సవాల్ చేయనున్న ఆర్ఎస్ఎస్