Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో ర్యాలీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓబీసీ అధికారులు రూ.100లో 33 పైసలు నిర్ణయిస్తారు

Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

Modi hits Rahul over OBC Quota: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉద్యోగ అవకాశాల్లో ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నారు. ఈ అంశాన్ని ఆయన ప్రధాన అజెండాగా తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి ఓబీసీ రిజర్వేషన్లను ఇవ్వలేదని, పైగా ఆ రిజర్వేషన్లను వ్యతిరేకించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిప్పి కొట్టారు.

కాంగ్రెస్ మీద మోదీ ఫైర్
సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ “కాంగ్రెస్ మనస్తత్వాన్ని మీరు గుర్తించాలి. పంచాయితీ నుంచి పార్లమెంటు వరకు ప్రభుత్వాన్ని నడిపింది ఇదే కాంగ్రెస్. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ ఓబీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇవ్వని కాంగ్రెస్‌ ఇదే. మెడికల్ కాలేజీల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయని కాంగ్రెస్ ఇదే’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రాజీవ్ గాంధీని ప్రస్తావించిన అమిత్ షా
మధ్యప్రదేశ్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఎప్పుడూ ఓబీసీ వర్గాన్ని అవమానిస్తూనే ఉంది. మండల్ కమీషన్ రిపోర్టు రాగానే కాంగ్రెస్ చాలా ఏళ్లు అణచివేసింది. మండల్ కమిషన్ అమలును రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు. వెనుకబడిన తరగతుల కమిషన్‌కు 70 ఏళ్లుగా రాజ్యాంగ గుర్తింపు లభించలేదు’’ అని అన్నారు.

రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
మధ్యప్రదేశ్‌లోని నీముచ్ జిల్లాలో ర్యాలీ చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఓబీసీ జనాభా ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓబీసీ అధికారులు రూ.100లో 33 పైసలు నిర్ణయిస్తారు. వారి జనాభా 0.33 శాతం ఉంటే అది మంచిది, కానీ ఓబీసీ జనాభా 50 శాతం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కుల గణన చేపట్టాలని పార్లమెంట్‌లో ప్రధాని మోదీకి చెప్పాను. దీన్నిబట్టి దేశంలో ఎంతమంది జనరల్‌లు, ఓబీసీలు, దళితులు ఉన్నారో స్పష్టతతోపాటు తెలిసిపోతుంది’’ అని అన్నారు.