Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో ముందున్న గ్రామీణం.. అతి ఎక్కువ ఓట్ శాతం, అతి తక్కువ ఓట్ శాతం వచ్చిన నియోజకవర్గాలు ఏవో తెలుసా?

రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది

Karnataka Polls: కర్ణాటక ఎన్నికల్లో ముందున్న గ్రామీణం.. అతి ఎక్కువ ఓట్ శాతం, అతి తక్కువ ఓట్ శాతం వచ్చిన నియోజకవర్గాలు ఏవో తెలుసా?

Updated On : May 12, 2023 / 9:26 PM IST

Polling In Karnataka: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు చురుగ్గా పాల్గొన్నాయి. బెంగళూరు, మైసూరు, మంగళూరు వంటి నగరాల్లో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. కొన్ని చోట్ల అయితే 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. మాండ్యా జిల్లాలోని మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గం జనతాదళ్ సెక్యులర్ పార్టీకి కంచుకోట. గత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.

Karnataka Polls: 15 సార్లు ఎన్నికలు, 3 సార్లే పూర్తి స్థాయి ప్రభుత్వాలు.. కర్ణాటకలో ఈసారైనా 5ఏళ్ల ప్రభుత్వం వచ్చేనా?

ఇక బెంగళూరు ప్రాంతంలోని 28 స్థానాల్లో ఒకటైన సీవీ రామన్ నగర్‌ నియోజకవర్గంలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలో కేవలం 47.4 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. అయితే ఇదే నియోజకవర్గంలో 2018లో 51 శాతం నమోదైంది. ఈ స్థానం భారతీయ జనతా పార్టీకి కంచు కోట. ఈ స్థానాన్ని బీజేపీ వరుసగా మూడుసార్లు గెలుచుకుంది. కర్ణాటకలో సంవత్సరాల తరబడి ఓటింగ్ శాతంలోని వైరుధ్యాన్ని ఈ రెండు ఉదాహరణలు స్పష్టంగా చూపుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడూ పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుండగా, పట్టణ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి చాలా తక్కువ ఉత్సాహం కనిపిస్తోంది. 2023, 2018 రెండింటిలోనూ పట్టణ కేంద్రాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో సగటు ఓటింగ్ శాతం 20 శాతం ఎక్కువగా ఉందని డేటా చూపిస్తుంది.

Karnataka Congress: కర్ణాటకలో కాంగ్రెస్‌కు సరికొత్త ఉత్సాహం.. ఎందుకో తెలుసా?

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన ఒటింగుతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటింగ్ స్వల్పంగా పెరిగింది. ఓటరు ఓటింగ్ డేటా విశ్లేషణ ప్రకారం ప్రధానంగా గ్రామీణ పాత మైసూరు ప్రాంతంలో సగటున 83 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. బెంగళూరు ప్రాంతంలో అత్యల్పంగా కేవలం 55 శాతం మాత్రమే నమోదైంది. నిజానికి బెంగళూరు రీజియన్‌లో 2018తో పోలిస్తే ఈసారి ఓటింగ్‌ తక్కువగా నమోదైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతంలో వైవిధ్యభరితమైన ధోరణులను కనిపిస్తున్నాయి. పోల్ డేటా ప్రకారం, 14 అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఎనిమిది సందర్భాలలో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదైంది. ఈ ఎనిమిది సందర్భాల్లో అధికార పార్టీ 1962లో జరిగిన ఎన్నికలో మాత్రమే పూర్తి స్థాయి అధికారాన్ని పొందగలిగింది. మిగిలిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయింది. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి పాలనకు సైతం దారి తీసింది.

Karnataka Polls: హంగ్‭పై కుమారస్వామి ఓవర్ కాన్ఫిడెన్స్.. ఫలితాలు రాకముందే కాంగ్రెస్, బీజేపీలకు సైగలు

2018 అసెంబ్లీ ఎన్నికలలో, రాష్ట్ర రాజధాని శివార్లలో ఉన్న హోసాకోట్ నియోజకవర్గంలో అత్యధికంగా దాదాపు 90 శాతం పోలింగ్ నమోదైంది. బెంగళూరు నగరంలోని దాసరహళ్లిలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదైంది. ఇందులో దాదాపు 48 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కంటే ఇప్పుడు ఎక్కువ మంది ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 58.49 శాతంగా ఉన్న ఓటింగ్ శాతం 2019 నాటికి 68.1 శాతానికి పెరిగింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సగటు ఓటు పెరిగింది. ఎక్కువ మంది ప్రజలు ఓటింగులో పాల్గొన్నారు. 1989 నుంచి 2019 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో సగటున 64.3 శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో సగటు పోలింగ్ 68.4 శాతం నమోదైంది.