10TV Grama Swarajyam : నూతన సర్పంచ్‌లు పట్టుదలతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి : గుత్తా సుఖేందర్ రెడ్డి
10TV Gram Swarajyam : 10టీవీ నిర్వహించిన ‘సర్పంచ్‌ల సమ్మేళన-2025’ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడారు..
Gutta Sukhender Reddy
10TV Gram Swarajyam : 10టీవీ నిర్వహించిన ‘సర్పంచ్‌ల సమ్మేళన-2025’ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.. ఈ అవగాహన సదస్సుకు వచ్చిన సర్పంచ్‌లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాలు అభివృద్ధి చెందితే.. దేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మాగాంధీ చెప్పారు. ఆనాటి నుంచి నేటికీ గ్రామాల అభివృద్ధి చెందలేదా అంటే.. గ్రామాలు అభివృద్ధి చెందాయి. గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని సమస్యలు పరిష్కరించినా మళ్లీ పునరావృతం అవుతుంటాయి. నూతన సర్పంచ్‌లు పట్టుదలతో గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ.. గ్రామంలోని ప్రజలతో మమేకమై ముందుకెళ్తే ఖచ్చితంగా మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని నూతన సర్పంచ్‌లకు గుత్తా సుఖేందర్ సూచించారు.
మన వెనకాల ఎవరూ ఉండాల్సి అవసరం లేదు. మన పట్టుదలే మన్నల్ని గొప్ప నాయకుడిగా.. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలబెడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నూతన సర్పంచ్‌లకు గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా సర్పంచ్‌నే అడుగుతారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు చేయాల్సింది చట్టాలు తప్ప.. గ్రామాల్లో మోరీలు, రోడ్లు వేయడమో కాదు. కానీ, గ్రామంలో ప్రతి విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల ప్రమేయం కావాల్సి పరిస్థితి వచ్చింది. దీని వల్ల సర్పంచ్‌ల అధికారాలు తగ్గిపోతున్నాయి. గ్రామ సర్పంచ్‌లకు అధికారాలు ఎక్కువగా ఇవ్వాలనే ఆలోచనతోనే రాజీవ్ గాంధీ ఆనాడు.. చట్టాలను మార్చి సర్పంచ్ లకు అధికంగా పెరిగేలా చేశారని అన్నారు.
రాష్ట్ర, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధికి సహకారం అందిస్తాము తప్ప.. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ లదేనని గుర్తించాలని నూతన సర్పంచ్ లకు గుత్తా సుఖేందర్ సూచించారు. మీ సమస్యలను శాసనసభలో, శాసన మండలిలో లేదా వ్యక్తిగతంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మేము ముందుంటామని చెప్పారు.
