BIG BREAKING: గుజరాత్ లో కుప్పకూలిన విమానం.. ఫ్లైట్ లో 242 మంది ప్రయాణికులు
గుజరాత్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనతో విమానానికి తీవ్రంగా నిప్పంటుకుని భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.