‘అఖండ 2 తాండవం’ అన్ని పాటలు రిలీజ్.. అంతా శివమయమే.. సాంగ్స్ ఇక్కడ వినేయండి..

బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలోని అన్ని పాటలు కలిసి జ్యుక్ బాక్స్ రూపంలో రిలీజ్ చేసారు. ఇటీవల రిలీజయిన ఒక్క జాజికాయ జాజికాయ సాంగ్ తప్ప మిగిలిన పాటలన్ని శివుడి పైనే ఉన్నాయి. ఇక థమన్ ఈ పాటలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. మీరు కూడా అఖండ 2 తాండవం సాంగ్స్ వినేయండి..