Iran Israel Conflict: ట్రంప్ “డబుల్ గేమ్”: డీల్ చేసుకో… లేదంటే స్మాష్ అయిపోతావ్!
ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరవెనుక నుండి చక్రం తిప్పుతున్నారు. ఆయన చర్యలు, ప్రకటనలు గందరగోళంగా కనిపిస్తున్నా, దాని వెనుక ఒక పక్కా వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అసలు ట్రంప్ ఏం కోరుకుంటున్నారు? ఆయన వ్యూహం మిడిల్ ఈస్ట్‌లో శాంతిని తెస్తుందా లేక అగ్గి రాజేస్తుందా?

ఇటీవల G7 సమ్మిట్ నుండి అర్ధాంతరంగా బయలుదేరిన ట్రంప్, “నేను కాల్పుల విరమణ కోసం వెళ్లడం లేదు, యుద్ధానికి అసలైన ముగింపు కావాలి” అని వ్యాఖ్యానించారు. ఈ “అసలైన ముగింపు” అంటే ఏమిటనే దానిపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రంప్ డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది: “ఇరాన్ అణు ఆయుధాల తయారీని పూర్తిగా ఆపేయాలి.” ఈ షరతుకు ఇరాన్ ఒప్పుకోకపోతే, అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగనుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో, అమెరికా ఇరాన్‌పై దాడికి సిద్ధమవుతోందనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా, ఇరాన్ రహస్యంగా నిర్మించుకున్న అణు బంకర్లను ధ్వంసం చేయడానికి అమెరికా “బంకర్ బస్టర్ బాంబులను” ప్రయోగించవచ్చని కథనాలు వస్తున్నాయి. ఈ ప్రచారం ఇరాన్‌పై మరింత ఒత్తిడిని పెంచుతోంది. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో చూడండి