Israel-Iran War: ముగిసిన వార్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్
గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్! గత కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న బంగారు ధర ఇవాళ దిగివచ్చింది. తులం గోల్డ్ రేట్ రూ.2000 తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రా ధర రూ. 1,00,530గా పలుకుతుంది. గత కొన్ని రోజులుగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగడంతో గోల్డ్ రేట్లు పై పైకి వెళ్లాయి. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి ఎండ్‌కార్డ్ పడటంతో గోల్డ్ రేట్లు అమాంతం పడిపోయాయి. ప్రస్తుతం గోల్డ్ రెండు వారాల కనిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గోల్డ్ రేటు భారీగా దిగొచ్చింది.