Heavy Rain Alert: తెలంగాణలో వచ్చే 4 రోజులు భారీ వర్షాలు… వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ

తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతుపవనాలు తిరిగి చురుకుగా మారటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది