Nepal Earthquake : నేపాల్ కు సహాయ సహకారాలు అందిస్తామన్న భారత్
నేపాల్ లో పెను విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప విపత్తులో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 140 మంది గాయపడ్డారు. నేపాల్ కు సహాయ సహకారాలు అందించనున్నట్లు భారత్ తెలిపింది. ఈ మేరకు నేపాల్ ప్రజలకు సంఘీభావంగా భారత్ నిలుస్తుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.