Job Mela: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి బంపర్ ఆఫర్.. అమెజాన్, యాక్సిస్ సంస్థలో ఉద్యోగాలు.. అస్సలు మిస్ అవకండి
Job Mela: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాను నిర్వహిస్తూనే ఉంది.

Job fair on August 5 at SKP Government Degree College, Guntakal, AP
చదువు పూర్తి మంచి ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ఎప్పటికప్పుడు జాబ్ మేళాను నిర్వహిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి జాబ్ మేళానే నిర్వహించనుంది. ఏపీ గుంటకల్‌లోని అంబేద్కర్ నగర్‌లో గల SKP ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 5న ఈ జాబ్ మేళా జరుగనుంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్తలకు మంచి జీతం అందించనున్నారు. కాబట్టి, నిరుద్యోగ యువత తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
సంస్థ, ఉద్యోగాలు, ఖాళీల వివరాలు:
- సాయి వికాస్ ఎంటర్‌ప్రైజెస్ పోస్టులు 50
- ఎస్‌బిఐ లైఫ్ పోస్టులు 50
- శ్రీరాం చిట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పోస్టులు 50
- ముత్తూట్ ఫైనాన్స్ పోస్టులు 50
- కీర్తి మెడికల్స్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్టులు 50
- వికాసా హ్యుందాయ్ మొబిస్ పోస్టులు 100
- పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ పోస్టులు 50
- యాక్సిస్ బ్యాంక్ పోస్టులు 10
- అమెజాన్ గిడ్డంగి పోస్టులు 100
- కొజెంట్ ఈ సర్వీసెస్ లిమిటెడ్ పోస్టులు 100
మరిన్ని సందేహాల కోసం 8096763970 ను సంప్రదించవచ్చు.