జూబ్లీ హిల్స్ పోలింగ్ బూత్‌ల వద్ద టెన్షన్ టెన్షన్.. క్యాష్ ఇస్తున్నారని ఇరు వర్గాల మధ్య తోపులాట

  • Published By: Mahesh T ,Published On : November 11, 2025 / 01:24 PM IST

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని వెంగలరావు నగర్‌లోని పోలింగ్ బూత్ నంబర్ 120 వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  డబ్బులు పంచుతున్నారని స్థానిక నేతలు ఆరోపించారు. నగదు పంచుతున్న వారిని స్థానికులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంగలరావు నగర్, 130 పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే తరహాలో డబ్బుల పంపిణీ ఆరోపణల నేపథ్యంలో గొడవ జరిగింది.

ఉదయం నుంచి చాలా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగినప్పటికీ, కొన్ని చోట్ల ఈ గొడవలు కలకలం రేపాయి. వెంగలరావు నగర్ 120 పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు పట్టుకున్న వ్యక్తి ఎవరు, ఏ పార్టీకి చెందినవాడు, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారా అనే విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.