Rahul Sipligunj : రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ దేశభక్తి పాట విన్నారా? ‘రామ్’ సినిమా నుంచి ‘బ్రేవ్ హార్ట్స్’ పాట విడుదల..
రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) చిత్రంలోని బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఓ దేశ భక్తి సాంగ్ ని రిలీజ్ చేశారు.
Rahul Sipligunj : దీపిక ఎంటర్‌టైన్‌మెంట్, ఓఎస్‌ఎం విజన్ బ్యానర్స్ నిర్మాణంలో ప్రొడక్షన్ నెం.1గా రామ్ (RAM/ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా రూపొందిస్తున్నారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో సూర్య హీరోగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు మిహిరామ్ వైనతేయ దర్శకత్వంలో ధన్య బాలకృష్ణ హీరోయిన్ గా భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్, రవివర్మ, మీనా వాసు.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్రెడీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ చిత్రంలోని బ్రేవ్ హార్ట్స్ అంటూ సాగే ఓ దేశ భక్తి సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ పాటని రాము కుమార్ ASK రాయగా ఆశ్రీత అయ్యంగార్ సంగీతంలో రాహుల్ సిప్లిగంజ్ పాడాడు..
Also See : Jagapathi Babu : సలార్ సినిమా గురించి జగపతి బాబు స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా?