కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అయ్యేదెవరు?
ఢిల్లీ నుంచి ఫోన్ లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేస్తున్నారు మీనాక్షి నటరాజన్, కేసీ వేణుగోపాల్. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లనుంచి అభిప్రాయాలు సేకరించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ రోజు సాయంత్రం వరకు అధికారికంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోసం అభ్యర్థులను ప్రకటించనుందని సమాచారం.