Stomach Cancer Risk : ఈ 5 అలవాట్లతో కడుపు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

Stomach Cancer Risk : మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆరోగ్యకరమైన అలవాట్లతో ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తపడవచ్చు. కొన్ని అలవాట్ల కారణంగా కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Stomach Cancer Risk : ఈ 5 అలవాట్లతో కడుపు క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!

5 Bad Habits That Increase Your Chances Of Developing Stomach Cancer

Stomach Cancer Risk : కడుపులో అదేపనిగా నొప్పిగా ఉంటుందా? తీవ్ర అలసట, తరచుగా రక్తపడటం వంటి ఇతరేతర లక్షణాలు ఉన్నాయా? అయితే, తస్మాత్ జాగ్రత్త.. అది క్యాన్సర్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా మూడో అత్యంత ప్రాణాంతకమైన, ఐదో అత్యంత సాధారణ క్యాన్సర్‌గా కడుపు క్యాన్సర్ ఉంది. ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా కడుపులోని లోపలి పొరను దెబ్బతీస్తుంది.

2020లో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సుమారు 50వేల కొత్త కడుపు క్యాన్సర్ కేసులు ఉన్నాయని పేర్కొంది. జన్యుశాస్త్రం, జీవనశైలి అలవాట్లు క్యాన్సర్ బారినపడేలా చేస్తాయి. అందుకే, అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి అరోగ్యకరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Read Also : Health Effects of Tea: టీ తాగుతున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసా?

దీర్ఘకాలిక అజీర్ణం లేదా గుండెల్లో మంట, అవాంఛిత బరువు తగ్గడం, పొత్తికడుపు నొప్పి, వికారం లేదా నిరంతర వాంతులు, ముఖ్యంగా రక్తం పడటం, ఆకలి లేకపోవటం, మలం విసర్జనలో ఇబ్బంది వంటి కొన్ని లక్షణాలు కడుపు క్యాన్సర్‌ను సూచిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిర్థారణ అనంతరం అవసరమైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మన అలవాట్లు, జీవనశైలి అలవాట్ల కారణంగా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని గమనించడం చాలా ముఖ్యం. దూరంగా ఉండవలసిన 5 అలవాట్లు ఏంటో ఓసారి పరిశీలిద్దాం..

1. సాల్టీ ఫుడ్స్‌ అతిగా తినడం :
పిక్లింగ్ వెజిటేబుల్స్, స్మోక్డ్ మీట్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ వంటి వాటిలో మితిమీరిన ఉప్పు ఉంటుంది. ఇలాంటి ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల మీ పొట్టలో మంటను పెంచుతుంది. అలానే కొనసాగిస్తే కడుపు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మాత్రమే పాటించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

2. అతిగా ధూమపానం :
ధూమపానం అలవాటు ఆరోగ్యానికి హానికరం.. మీ శరీరానికి తీవ్రహాని చేస్తుంది. మీ ఊపిరితిత్తులు, చర్మం లేదా కడుపులో ఎక్కడైనా క్యాన్సర్ కణాలు వృద్ధిచెందుతాయి. అతిగా ధూమపానం చేసేవారిలో అనారోగ్యకరమైన సమస్యలు అధికంగా ఉంటాయి. వారిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధుల తీవ్రతను పెంచుతుంది.

3. చక్కెర పానీయాలు, స్నాక్స్ తినొద్దు :
అధిక చక్కెరను కలిగిన పానీయాలు, చిరుతిళ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్థూలకాయం, కడుపు క్యాన్సర్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఆకలి లేకపోయినా అతిగా తినే అలవాటు మంచిది కాదు. చిరుతిళ్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువగా నీరు తీసుకోవాలి. తియ్యని పదార్థాలను తీసుకోవడం నివారించాలి.

4. పండ్లు, కూరగాయలను తక్కువగా తినడం :
సరైన పండ్లు, కూరగాయలను తినకపోవడం ద్వారా అవసరమైన పోషకాలు శరీరానికి అందవు. అది తీవ్రమైన హానికి దారితీస్తుంది. అందువల్ల, సరైన ఆహారంలో మార్పులు చేయడం వల్ల తీవ్రమైన కడుపు సంబంధిత అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ప్రతిరోజూ ఏదో ఒక పండును ఆహారంలో భాగం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.

5. అధిక ఒత్తిడి :
దీర్ఘకాలిక ఒత్తిడి అనేది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మీ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. అది కాస్తా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. విశ్రాంతి, ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి ఎక్కువగా చేస్తుండాలి. ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

చాలా కాలం పాటు ఈ లక్షణాలను కలిగి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. శస్త్రచికిత్సా విధానాలు, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటి చికిత్సల ద్వారా క్యాన్సర్ లక్షణాలను గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి పద్ధతులను పాటించడం ద్వారా మీ కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

Read Also : Kiwis Health Benefits : కివీస్ పండ్లను తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలివే!