సమ్మర్ అప్పుడే వచ్చేసింది.. కుండలు తెచ్చుకున్నారా? కుండలో వాటర్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఇవే…

వేసవిలో రిఫ్రిజిరేటర్ నుండి చల్లటి నీటిని తాగడం కన్నా మట్టి కుండలో నీరు తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

సమ్మర్ అప్పుడే వచ్చేసింది.. కుండలు తెచ్చుకున్నారా? కుండలో వాటర్ తాగితే వచ్చే బెనిఫిట్స్ ఇవే…

Updated On : February 18, 2025 / 3:18 PM IST

కుండలోని నీరు సహజంగానే చల్లగా, రుచిగా ఉంటుంది, సమ్మర్ లో మన దాహం తీర్చడానికి కుండ నీరు చాలా మంచిది. ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల కొన్నిసార్లు గొంతు నొప్పి, జలుబు వస్తాయేమో కానీ కుండలోని నీటిని తాగడం వలన శరీరానికి ఎలాంటి హాని లేదట. శరీరానికి సరిపడా నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా సమ్మర్లో శరీరంలోని నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోయే కారణంగా డీహైడ్రేషన్‌ సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, ఫ్రిజ్ వాటర్ ని అధికంగా తీసుకోవడం అంతా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఫ్రిజ్ నీటికి బదులుగా కుండలో నిల్వ ఉంచిన నీటిని తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. మరి కుండ నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

1) కుండ నీటిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యాంగా ఉండడానికి చాలా అవసరం.
2) కుండలోని నీరు తాగడం వలన మనం తిన్న ఫుడ్ తొందరగా జీర్ణం అవుతుంది అలాగే గ్యాస్, జీర్ణకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ తక్కువ.
3) కుండలోని నీరు ‘రోగనిరోధక శక్తిని’ పెంచడానికి సహాయపడుతుంది.
4) మట్టి కుండ వాటర్ తాగడం వలన చర్మాన్ని తేమగా ఉంచి, మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
5) కుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ అనేవి లేకపోవడం వలన వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉండవు అలాగే మట్టికుండ సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడుతుందని, కుండ నీళ్లు తగిన వాళ్ళు జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
6) కుండ నీరుతో ఎలాంటి గొంతు నొప్పి, జలుబు, వేడి చేయడం వంటి ఆరోగ్య సమస్యలు దగ్గరకు కూడా రావట.

కుండలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది సహజంగా చల్లగా ఉండటమే కాకుండా, ఖనిజాలు మరియు ఇతర పోషకాలను కూడా కలిగి ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.