Eye Flu: యువతలో కండ్లకలక 49% పెరిగిందని చెబుతున్న తాజా సర్వే

వర్షాకాలం ప్రారంభం కావడంతో, కండ్లకలక కోసం సంప్రదింపులు గణనీయంగా పెరిగాయి. వ్యక్తులు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి

Eye Flu: యువతలో కండ్లకలక 49% పెరిగిందని చెబుతున్న తాజా సర్వే

Updated On : August 3, 2023 / 9:27 PM IST

Eye Flu: దేశంలో గత కొన్ని వారాలుగా భారీ వర్షాలు, వరదలు సంభవించడంతో భారతదేశంలోని అతిపెద్ద డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ మెడిబడ్డీ.. కండ్లకలక/కంటి ఫ్లూ సంబంధిత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు నివేదించింది. సంస్థ డాటా ప్రకారం, వివిధ కంటి సంబంధిత సమస్యల కోసం వైద్య సలహాలను కోరుకునే రోగుల సంఖ్య మరింత పెరుగుతుందట. కండ్లకలక, కళ్ళు ఎర్ర బడి నీరు కారటం, నిద్ర లేచిన వెంటనే కళ్ళు అంటుకునే ఉండటం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ విషయమై మెడిబడ్డీ మెడికల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ గౌరీ కులకర్ణి మాట్లాడుతూ, “వర్షాకాలం ప్రారంభం కావడంతో, కండ్లకలక కోసం సంప్రదింపులు గణనీయంగా పెరిగాయి. వ్యక్తులు ఈ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి” అని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, కండ్లకలక వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలను అనుసరించాలని మెడిబడ్డీ కోరింది. తరచుగా చేతులు కడుక్కోవడం, చేతులతో కళ్లను తాకకుండా ఉండటం, శుభ్రత పాటించటం వంటి ముఖ్యమైన పద్ధతులు ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించగలవు.

నేత్ర వైద్య సంప్రదింపుల పెరుగుదలతో పాటు, ఇతర వైద్య ప్రత్యేకతలలో కూడా సంప్రదింపులు పెరిగాయని మెడిబడ్డీ గమనించింది. బరువు నిర్వహణ సంప్రదింపులలో 56%, ఎండోక్రినాలజీ సంప్రదింపులు 67% పెరిగాయట.