కరోనా వైరస్ కంట్రోల్ కి ఏపీ ప్రభుత్వం సన్నధ్ధం

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సిధ్ధంగా ఉంది. ఇప్పటికే పక్క రాష్ట్రమైన తెలంగాణలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో… ఏపీలోని బోధనాసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని విమానాశ్రయాలు, నౌకాశ్రయ ప్రాంతాల్లో సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు విస్తృత పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాల వద్ద వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే తిరుమల, తిరుపతిలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితుల కఫం, రక్త నమూనాలను పుణె, హైదరాబాద్‌కు పంపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మరోవైపు చైనాలోని బీజింగ్ లో ఆదివారం ఒక్కరోజే 57 మంది కరోనా వైరస్ దెబ్బకు కన్నుమూశారు. దీంతో చైనాలో మొత్తం మరణించిన వారి సంఖ్య 361కి చేరింది. మరో 17,025 మందికి ఈ వైరస్ సోకినట్లు అధికారులు నిర్థారించారు. ఒక్కరోజులో కొత్తగా 2,829 కేసులు నమోదయ్యాయని… వీరిలో 186 మంది పరిస్ధతి విషమంగా ునతలు తెలిసింది. ఇటు భారత్ లోని కేరళలోనూ రెండో కరోనా కేసు నమోదైంది.