చైనాలో ‘బుబోనిక్ ప్లేగు’ వ్యాప్తిపై అలర్ట్.. హానికర జంతువులను తినడంపై నిషేధం!

ప్రాణాంతక కరోనా వైరస్ ఉద్భవించిన చైనాలో మరో మహమ్మారి పుట్టుకోస్తోంది. బుబోనిక్ ప్లేగు వ్యాధి ప్రబులుతోంది. గతంలో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మళ్లీ చైనాలో విజృంభించే అవకాశాలు కనిపిస్తాన్నాయి. కరోనా నుంచి తేరుకున్న చైనాకు బుబోనిక్ ప్లేగు వ్యాధి ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే ఈ ప్లేగు వ్యాధికి సంబంధించి కొన్ని కేసులు నమోదు అయినట్టు చైనా ఆస్పత్రులు వెల్లడించాయి. మంగోలియన్ ఆసుపత్రిలో అనుమానాస్పద కేసు నమోదైన తరువాత చైనా అధికారులు బుబోనిక్ ప్లేగు గురించి హెచ్చరిక జారీ చేశారు. కొన్ని జంతువులను తినడం నిషేధించారు. మధ్య యుగాల బ్లాక్ డెత్ అని పిలిచే ఈ వ్యాధి ప్రాణాంతక అంటువ్యాధిగా చెబుతున్నారు. ఎలుకల మీద వాలిన ఈగలు ద్వారా వ్యాపిస్తుంది.
మంగోలియాలో 4 ప్లేగు వ్యాధి కేసులు :
ప్రాణాంతక వ్యాధితో అనారోగ్యానికి గురైనట్లు ఓ అనుమానిత రోగిని ఆసుపత్రిలో నిర్ధారించారు. ఒక రోజు తర్వాత చైనా ప్రాంతంలో ఇన్నర్ మంగోలియాలో ఈ హెచ్చరిక విడుదల చేసింది. బయాన్ నూర్ నగరం ఆరోగ్య కమిటీ 3వ స్థాయి హెచ్చరికను జారీ చేసింది. నాలుగు-స్థాయి వ్యవస్థలో రెండవది కూడా. ప్లేగు వ్యాధిని వ్యాప్తి చేసే జంతువులను వేటాడటం, తినడాన్ని నిషేధిస్తుంది.
ప్లేగు లేదా జ్వరం ఉన్నట్లు అనుమానించిన కేసులను నివేదించాలని కోరుతున్నారు. గత నవంబర్‌లో ఇన్నర్ మంగోలియాకు చెందిన వారిలో ప్లేగు వ్యాధి ఉన్నట్లు నివేదించిన 4 కేసులు నమోదయ్యాయి. ఇందులో రెండు న్యుమోనిక్ ప్లేగు, ప్లేగు ప్రాణాంతక వైవిధ్యమైనగా తేల్చారు. చైనాలో ప్లేగు కేసులు సర్వసాధారణం. కానీ, ప్లేగు వ్యాప్తి చాలా అరుదుగా మారింది. 2009 నుంచి 2018 వరకు చైనాలో 26 కేసులు నమోదు కాగా, 11 వరకు మరణాలు నమోదయ్యాయి.
మరోవైపు కరోనావైరస్ వ్యాప్తితో దాదాపు 11.3 మిలియన్ల మంది బారిన పడ్డారు. 531,000 మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్త సంస్థ (WHO)ప్రపంచవ్యాప్తంగా 212,000 కేసులు నమోదైందని వెల్లడించింది. భారతదేశం, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, బ్రెజిల్, అనేక ఇతర లాటిన్ అమెరికన్ దేశాలలో వ్యాప్తి చెందుతోంది. దక్షిణాఫ్రికాలో ఒకే రోజులో 10,000 కంటే ఎక్కువ కొత్త కేసులు పెరిగాయి. ధృవీకరణ కేసుల నివేదికలలో 60 శాతానికి పైగా అమెరికాలో ఉన్నాయని WHO పేర్కొంది.
తాగిన వ్యక్తుల్లో సామాజిక దూరం కుదరదు:
COVID కేసులు పెరిగేకొద్దీ, చాలా దేశాలు లాక్ డౌన్‌లు సులభతరం చేస్తూనే ఉన్నాయి. బ్రిటన్‌లో పబ్బులు, బార్బర్స్ నెలల్లో మొదటిసారి తిరిగి తెరుచుకున్నాయి. అయినప్పటికీ కూడా అత్యవసర సర్వీసులకు ఎలాంటి అంతరాయం లేదు. కానీ, ఒక సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ… తాగుబోతులు సామాజిక దూర నియమాలను పాటించలేరని లేదా విస్మరించారని అన్నారు. ముఖ్యంగా పబ్బులు తిరిగి తెరవడం ద్వారా ప్రజలను సామాజిక దూర నియమాలను విస్మరించే అవకాశం ఉంటుందని, అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read:కరోనా నుంచి కోలుకొన్నవారిలో కొత్త సమస్య.. దీనికి చికిత్స లేదు..