కరోనా డేంజర్ జోన్: బస్సు, రైళ్లలో హ్యాండ్ రెయిల్స్‌పై 72 గంటలు వైరస్ బతికే ఉంటుంది!

  • Published By: sreehari ,Published On : March 6, 2020 / 02:05 PM IST
కరోనా డేంజర్ జోన్: బస్సు, రైళ్లలో హ్యాండ్ రెయిల్స్‌పై 72 గంటలు వైరస్ బతికే ఉంటుంది!

Updated On : March 6, 2020 / 2:05 PM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఇప్పడు భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో అదృష్టవశాత్తూ కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. భయపడాల్సిన పనిలేదు. కానీ, వైరస్‌ను నమ్మలేం.. కరోనా ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా ఎక్కువ గంటలు బతికే ఛాన్స్ లేదు కదా? కరోనా మమ్మల్ని ఏం చేస్తుందిలే అని అనుకోవద్దని అంటున్నారు. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. బస్సు, రైళ్లలలో ప్రయాణిస్తున్నా ఎక్కడైనాసరే.. కరోనా కాటేసే ప్రమాదం ఉంది.

అది ఏ వస్తువు రూపంలోనో లేదా ఏ వ్యక్తి రూపంలో మీకు సోకుతుందో చెప్పలేని పరిస్థితి. చేతులను పదేపదే ముఖం, ముక్కు, కళ్లపై తాకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.. అప్పుడే ఈ వైరస్ బారి నుంచి బయటపడతారు. కరోనా ప్రభావం పెద్దగా లేదులే.. ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ఉండకండి.. మీరింకా కరోనా డేంజర్ జోన్ లోనే ఉన్నారని మరిచిపోకండి.. ఈ విషయంలో బ్రిటన్ ప్రముఖ వైద్య నిపుణులు ప్రొఫెసర్ క్రిష్ విట్టీ హెచ్చరిస్తున్నారు. 

Train journey

కరోనా ఎక్కువ గంటలు బతికే ఛాన్స్ లేదు కదా? కరోనా మమ్మల్ని ఏం చేస్తుందిలే అని అనుకోవద్దని అంటున్నారు. కరోనా వైరస్ ఏయే ప్రదేశాల్లో ఎలాంటి వస్తువులపై ఎంతసేపు బతికి ఉంటుందో ఆయన చెబుతున్నారు. గట్టి ఉపరితలాలైన హ్యాండ్ రెయిల్స్ పై 72 గంటల పాటు (మూడు రోజుల పాటు) కరోనా వైరస్ బతికే ఉంటుందని చెప్పారు. బస్సుల్లోనూ, రైళ్లలోనూ హ్యాండ్ రెయిల్స్ ఉంటాయి.

ఆ రెయిల్స్ ను ఎక్కిన ప్రతి ప్యాసెంజర్ పట్టుకుంటుంటారు. జర్నీలో పదేపదే తాకుతుంటారు. వారిలో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే.. అది ఇతరులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. అందుకే ప్రయాణ సమయాల్లో ముఖ్యంగా హ్యాండ్ రెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హ్యాండ్ రెయిల్స్ పై కరోనా వైరస్ కేవలం 48 గంటల్లోనే చనిపోయే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం లండన్ లో కరోనా వైరస్ సోకిన బాధితుల సంఖ్య 90కి చేరింది. 
Train virus

స్కాట్ లాండ్ లో మరో కొత్త మూడు కేసులు నమోదయ్యాయి. హ్యాండ్ రెయిల్స్ తాకగానే కరోనా వైరస్ సోకుతుందా? అంటే అలా సోకదని ప్రొఫెసర్ విట్టీ క్లారిటీ ఇచ్చారు. హ్యాండ్ రెయిల్స్ తాకిన చేతితో ముఖంపై లేదా ముక్కు, కళ్లు, నోరుపై ముట్టుకోవడం చేసినప్పుడు మాత్రమే కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. అందుకే బయటకు వెళ్లిన సమయాల్లో పొరపాటున కూడా చేతిని ముఖంపై తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. హ్యాండ్ రెయిల్స్ ముట్టుకున్నా పర్వాలేదు.. కానీ, అలా ముట్టుకున్న చేతులతోనే ముఖాన్ని తాకితేనే ప్రమాదం అంటున్నారు.

Hand wash
హ్యాండ్ రెయిల్స్ తాకిన చేతులను సబ్బు, నీళ్లతో శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఇలా కడిగిన ప్రతిసారి హ్యాపీ బర్త్ డే అని రెండుసార్లు పాడుతూ చేతులు శుభ్రపరుచుకోవాలని హెల్త్ బాస్ లు జాగ్రత్తలు చెబుతున్నారు. ఎందుకంటే.. హ్యాపీ బర్తడే సాంగ్స్ రెండు సార్లు పూర్తి కావడానికి 20 సెకన్ల సమయం పడుతుంది. ఇంతలో మీ చేతిపై దాగిన వైరస్ వెళ్లిపోతుంది. ఆ తర్వాత నేరుగా మీ కళ్లను తాకరాదు.. ముక్కు, నోటిని కూడా తాకరాదు.. అశుభ్రమైన వస్తువులను కూడా తాకరాదు.

ఉపరితలాలను కూడా చేతులతో తాకరాదు.. అంతేకాదు.. ఎవరితోనైనా కలిసి మాట్లాడే సమయంలో షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వరాదు. ఎవరిలోనైనా ఫ్లూ లక్షణాలు ఉంటే.. వారి చేతి ద్వారా మీకు కూడా సోకే ప్రమాదం ఉందని అంటున్నారు ప్రొఫెసర్ విట్టీ.. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 96వేల వరకు నమోదయ్యాయి. దీని కారణంగా 3వేల మంది మృతిచెందారు.