కరోనా వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తుందంటున్న చైనా

కరోనా వైరస్.. ఇదో రకమైన బగ్.. ప్రాణాంతకమైన ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు లేవు. జంతువులు తినడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని కొందరు.. లేదు.. లేదు.. గాలి ద్వారా వ్యాపిస్తుందని మరికొందరు ఇలా ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ కొత్త కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈజీగా వ్యాపించగలదు. ఇన్ఫెక్షన్ ఎలాగైనా సోకొచ్చు.
వ్యాధిగ్రస్థులు తాకిన వస్తువులను తాకడం ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. చైనాలోని వైద్యాధికారులు చెప్పిన ప్రకారం.. 2019-nCoV బగ్ వైరస్.. గాలి ద్వారా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందగలదని అంటున్నారు. చైనాలోని వైద్య నిపుణుల్లో ఒకరైన షాంఘై పౌర వ్యవహారాల బ్యూరో డిప్యూటీ హెడ్ జెంగ్ ఖున్ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ .. నేరుగా ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందన్నారు.
ఎప్పుడైతే వైరస్ సోకిన వ్యక్తిని తాకినప్పుడు ఈ వైరస్ అంటువ్యాధిలా వ్యాపిస్తుందని తెలిపారు. చైనా డెయిలీ న్యూస్ పేపర్ రిపోర్టును జెంగ్ ప్రస్తావిస్తూ.. పెద్ద మొత్తంలో కరోనా వైరస్ బగ్స్.. కారణంగా సాధారణ వ్యాధుల్లో కనిపించే లక్షణాల్లో జలుబు మొదటి లక్షణంగా కనిపిస్తుంది.
SARS వైరస్ కూడా గాలి ద్వారా వ్యాపిస్తుందని ఆయన చెప్పారు. చైనాలోని మున్సిపల్ ప్రభుత్వం డేటా ప్రకారం.. ఈ కరోనా బగ్.. 900 మందిని బలితీసుకున్నట్టు జెంగ్ చెప్పారు. ఎయిరోసోల్ ట్రాన్స్‌మిషన్ అంటే.. గాల్లోకి నీటి బిందువుల్లో విడుదలైన వైరస్ గాలిద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుందని వైద్య నిపుణులు తెలిపారు.
ఇలాంటి వ్యాధులను వ్యాప్తి చేసే వైరస్.. గాల్లో ఎక్కువ సమయం ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ, కొన్ని వ్యాధులు మాత్రమే గాలి ద్వారా వ్యాపిస్తాయని అంటున్నారు. అందులో ట్యూబర్ క్లోసిస్(క్షయ వ్యాధి), తట్టు వంటి వ్యాధులు కూడా గాలి ద్వారనే వ్యాపిస్తాయని అంటున్నారు.
వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు ఎవరూ ఒకే చోట ఉండరాదని జెంగ్ పబ్లిక్ ను సూచిస్తున్నారు. 2019- nCoV సిద్ధాంతంలో ఈ బగ్ గాలి ద్వారా వ్యాపించగలదని షాంఘై పబ్లిక్ హెల్త్ క్లినికల్ సెంటర్ మెడికల్ డైరెక్టర్ షెన్ యింజ్ హాంగ్ అన్నారు. అయితే, దీన్ని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరమని షెన్ అన్నారు.