కరోనా వ్యాక్సిన్.. వేలాది డోస్‌లను Pfizer ఎలా తయారుచేస్తోందో చూడండి!

Pfizer Covid vaccines : మల్టీనేషనల్ డ్రగ్ కంపెనీ Pfizer ఇప్పటికే బెల్జియంలోని తన ప్లాంట్‌లో లక్షలాది వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేసింది. ఈ ఏడాదిలో 100 మిలియన్ల డోస్‌లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. Pfizer కంపెనీ కరోనా వ్యాక్సిన్ కోసం వేలాది టినీ బాటిళ్లలో వేలకొలది డోస్ లను తయారుచేస్తోంది.
యూకేలో మాత్రం 40 మిలియన్ల డోస్ లు అందుబాటులోకి రానున్నాయి. 2021 నాటికి 1.3 బిలియన్ల మోతాదులను ఉత్పత్తి చేసే దిశగా ప్లాన్ చేస్తోంది.
ప్రతి పేషెంట్ కు వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. Pfizer కంపెనీ బెల్జియంలోని తన ప్లాంట్‌లో వందలాది వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేయడం చాలా సంతోషంగా ఉందని Pfizer UK boss Ben Osborn ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రస్తుతం 44,000 మందిపై జర్మనీకి చెందిన BioNTechతో Pfizer కంపెనీ సంయుక్తంగా ట్రయల్స్ నిర్వహిస్తోంది.
నవంబర్‌లో టీకాకు అమెరికా అనుమతి కోసం అత్యవసరంగా దరఖాస్తు చేసుకోవాలని యోచిస్తున్నట్లు గత వారమే తెలిపింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రారంభించే రేసులో ఫైజర్‌ను ముందుకు రానుంది. కెంట్‌లోని శాండ్‌విచ్‌లో ఫైజర్ ల్యాబరేటరీలో కోవిడ్ -19 నివారణను అందించే మందులు ఉన్నాయని Osborn చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో Oxford యూనివర్శిటీలో భారీ మొత్తంలో వ్యాక్సిన్ మోతాదులను ఆస్ట్రాజెనెకా తయారుచేయనుందని ఇంగ్లాండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ Jonathan Van-Tam తెలిపారు. ఇప్పటికే వేలాది మంది NHS సిబ్బందికి వ్యాక్సిన్ తయారీలో శిక్షణ ఇచ్చారు.
క్రిస్మస్ తర్వాత ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. Oxford/AstraZeneca వ్యాక్సిన్ మూడో దశ ఫలితాలు రాబోయే నవంబర్ ఆఖరులో వచ్చే అవకాశం ఉందని ప్రొఫెసర్ Van-Tam పేర్కొన్నారు. మరోవైపు NHS తమ కరోనా వ్యాక్సిన్ ను ఈ ఏడాది డిసెంబర్ నెలలో క్రిస్మస్ తర్వాత ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.